Rohit Sharma: రోహిత్ను పక్కన పెట్టారా..? అభిమానుల్లో అనేక సందేహాలు 4 d ago

ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబయి ఇండియన్స్ పరాజయాలను మూటగట్టుకుంటోంది. దీనికి తోడు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ విఫలమవుతూనే ఉన్నాడు. దీంతో శుక్రవారం లక్నోసూపర్ జెయింట్ మ్యాచ్లో హిట్ మ్యాన్ పక్కనబెట్టడంపై ఫ్యాన్స్లో ఆందోళన, సందేహాలను రేకెత్తించింది. రోహిత్ నిరాశజనక ప్రదర్శన వల్లే అతనిని మేనేజ్మెంట్ పక్కన పెట్టిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నెట్లో సాధన చేస్తుండగా.. రోహిత్ మోకాలికి గాయమైందని, అందుకే అతను మ్యాచ్లో ఆడలేదని తెలుస్తోంది. తదుపరి మ్యాచ్లో రోహిత్ ఆడేతే కాని అభిమానుల సందేహాలకు నివృత్తి దొరకదు.